ప్రజాగళం సభలో నరేంద్ర మోదీ చెప్పినట్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు తీస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే నవ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని అన్నారు. కచ్చితంగా కేంద్రంలో 400 సీట్లతో ఎన్టీయే ప్రభుత్వం రావాలని ఆకాంక్షంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ అవినీతిలో కూరుకుపోయిన వై.సీ.పీ. పాలన పోవాలి కోరారు.
అన్ని శాఖల్లోనూ జరుగుతున్న అవినీతి మీద జనసేన పార్టీ ఎప్పటికప్పుడు వివరాలు బయటపెడుతూనే ఉందన్నారు. విద్యాశాఖ దగ్గర నుంచి ఇసుక, మద్యం, సలహాదారులు ఇలా దొరికిన కాడికి అవినీతి చేసిన వై.సీ.పీ. ప్రభుత్వంలో మంత్రులు ఎంత అవినీతి చేస్తున్నారో ప్రధాని కి వివరించారు. వై.సీ.పీ. పాలన ఎంత అక్రమాల్లో కూరుకుపోయిందో వివరించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎన్టీయేకు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

