Exclusive

స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్ ను చేసిన గుజరాత్ విద్యాశాఖ…!!!

istockphoto-868748682-170667a

పదోతరగతి పరీక్షకు ముందు ముస్లిం బాలికల హిజాబ్‌లు తీసేయమని బలవంతం చేశారన్న ఆరోపణపై తల్లిదండ్రుల ఆగ్రహించడంతో గుజరాత్ విద్యాశాఖ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను పరీక్ష నిర్వాహకురాలిగా తొలగించింది. గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ జి.ఎస్‌.హెచ్‌.ఎస్‌.ఇ.బి. బుధవారం గణిత శాస్త్ర పేపర్‌కు ముందు భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ పట్టణంలోని లయన్స్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

జిల్లా విద్యాశాఖాధికారి స్వాతిరావు, సంబంధిత తల్లిదండ్రులతో సమావేశమై, సీ.సీ. టీ.వీ. ఫుటేజీని పరిశీలించిన తర్వాత పరీక్షా కేంద్ర నిర్వాహకునిగా ఇలాబెన్ సురతియాను తొలగించాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ… నేను సి.సి. టి.వి. ఫుటేజీని చూశానని అన్నారు. తల్లిదండ్రులు  ఈ విషయంలో దరఖాస్తును నాకు అందించారన్నారు. నేను ఈ సంఘటనపై విచారణకు ఆదేశించానని ఫిర్యాదులో మెరిట్ ఉన్నట్లు గుర్తించినందున పరీక్షా కేంద్రం నిర్వాహకుడిని మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించానని చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.