ఆపదలోవున్నవారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటు తో తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెలల నుండి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీ శంకర్ కుటుంబానికి వివేకా అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25కేజీల బియ్యం ,నిత్యావసర కిరాణా సరుకులు అందజేసారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఆటో కార్మిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు ఖాతాలతో జీవన ప్రగతికి ఋణ సదుపాయం, మూల ధనంతో జీవనోపాధికి వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆటో కార్మికులు ప్రైవేటు రుణాలతో దోపిడీకి గురవుతున్నారన్నారన్నారు. 40 ఏళ్ళకే వారు తీవ్ర అనారోగ్యదుస్తితి కలుగుతోందన్నారని అన్నారు. ఏటా 10వేలు ఇస్తున్న ప్రభుత్వం అదే తీరుగా రవాణా శాఖ పన్నులు వసూలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నూకరాజు, పి. లోవరాజు, సుబ్బారావు, ఖండవిల్లి బుజ్జి పాల్గొన్నారు.

