తమిళనాడుకు కర్ణాటక నీటిని విడుదల చేస్తోందన్న బీ.జే.పీ. ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. కర్ణాటకలోనే తాగునీటి అవసరాలకు నీళ్లు లేనప్పుడు తమిళనాడుకు నీళ్లు ఇచ్చే ప్రశ్నే తలెత్తదని ఆయన అన్నారు. హెగ్గవాడి వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర రిజర్వాయర్లలో నీళ్లు లేవని బీ.జే.పీ. ఆరోపణలు నిరాధారమన్నారు.
కేంద్రం నిర్దేశించినా… తమిళనాడు నీరు కావాలని కోరినా మేం నీళ్లు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం సోమవారం పౌరసత్వ సవరణ చట్టం సి.ఎ.ఎ. అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిందని సిద్ధరామయ్య అన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆయన అన్నారు.
