డాక్టర్ బి.ఆర్ .అంబేత్కర్ కొనసీమ జిల్ల అమలాపురం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఉన్న రైతులకు ఎకౌంట్ లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేసారు. దానితో ఆ గ్రామానికి చేందిన సుమారు 20 మంది రైతులు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చెప్పటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మాకు సుమారు 100 ఎకరాలు పంట భూములు ఉన్నాయి మాకు వచ్చిన ధాన్యాన్ని ఆర్.బి.కే. తరుపున ప్రభుత్వం కనుగొలు చేసి 51 రోజులు అయ్యిందని అన్నారు. కానీ ఇప్పటివరకు తమ అకౌంట్ లో డబ్బులు వేసిన దాకలాలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు. తమ భార్యలు మేడలో ఉన్న పుత్తులను తాకట్టు పెట్టి మళ్ళీ పంట వెయ్యటం జరిగిందని దయచేసి రైతులును వెంటనే అదుకుని తమకు న్యాయం చెయ్యండి అంటూ మీడియా ముందు గోడు విన్నబుచుకున్నారు.
మా రైతులను వెంటనే ఆదుకోండి…

