కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. గురువారం బీ.జే.పీ. లో చేరబోతున్నట్లు ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు. తాను ఒక వారం పాటు పార్టీతో టచ్‌లో ఉన్నానని ప్రస్తుతానికి తనతో సంబంధం కలిగి ఉంటానని పేర్కొన్నాడు. గంగోపాధ్యాయ మాట్లాడుతూ… ప్రధాని మోదీ కష్టపడేవాడు మరియు చాలా మంచి వ్యక్తి అని అభివర్ణిస్తూ… దేశ ప్రగతికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే బీ.జే.పీ. లో చేరాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ఇక్కడ తృణమూల్‌తో పోరాడగల ఏకైక పార్టీ అని నేను భావిస్తున్నాను అని కోల్‌కతాలోని తన ఇంటిలో విలేకరుల సమావేశంలో వెళ్లడించారు. అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు రాజీనామాను పోస్ట్ చేసిన రెండు గంటల తర్వాత ఈ విషమాన్ని తెలిపారు. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.
బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి…

