బీ.ఎస్.పీ. తెలంగాణ చీఫ్, మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయన బీ.ఆర్.ఎస్. తరపున పార్లమెంట్‌కు పోటీ చేయ్యడమో లేక బీ.ఆర్.ఎస్. పార్టీ తో పొత్తు పెట్టుకుని ఓ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడమో చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కే.సీ.ఆర్. తో సమావేశం కాగానే పార్టీ మార్పుపై ప్రచారం ప్రారంభమయింది. అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం.. తాను పార్టీ మారనని కానీ.. మారతాను అని కానీ చెప్పకుండా.. స్వేచ్చ, సమానత్వం వైపే ప్రయాణమంటూ ట్వీట్ చేశారు.
మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ…

