ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న 16 సెంటర్లు, 45 పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలు వచ్చాయి. ఈ సందర్బంగా ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఆత్మ స్థైర్యాన్ని ధైర్యంగా వారు ఓటు వినియోగించుకునే విధంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రీటౌన్ సీ.ఐ. ఏ.కే. కృష్ణ భగవాన్, ట్రాఫిక్ సీ.ఐ. ఎన్. రమేష్, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఎస్సై హిమాన్సు, ట్రాఫిక్ ఎస్సై కిషోర్, త్రీటౌన్ లా అండ్ ఆర్డర్ సిబ్బంది, వన్ టౌన్ ట్రాఫిక్ సిబ్బంది సీ.ఐ.ఎస్.ఎఫ్. కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఎలక్షన్ పోలింగ్ బూత్ పరిధిలో కేంద్ర బలగాలు…

