కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం పాతపెద్దాపురం పరిధిలోని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు. ఆ దాడుల్లో నాటు సారాయి అమ్ముతున్న కోమలి రాజు, కోమలి యేసురత్నంలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకొని కాకినాడ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. నాటుసారా కొందరు వ్యక్తులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉందని, వారిపై కూడా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నాటు సారా తయారీ, అమ్మడం, రవాణా చేస్తే అత్యంత కఠినంగా వ్యవహరించి అరెస్ట్ చేసి పీ.డీ. యాక్ట్ ను నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్ బి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నాటు సారా అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్…

