దేశవ్యాప్తంగా ప్రజలు మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా , మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ప్రముఖ వైద్యులు వెన్నపూస బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. ఎస్.వి.మనోర్ హోటల్ కన్వెన్షన్ హాల్లో కాస్మోపాలిటన్ సొసైటీ డైలాగ్ ఆన్ ప్రజెంట్ సొసైటీ ” అనే పేరుతో జన విజ్ఞాన వేదిక సభ్యులు కొమ్మన తాతారావు, పి. వి సత్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి ఆయన ముఖ్య అతిథిగా డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పాల్గొని స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్ బీయింగ్ అనే ఎజెండాతో ముఖ్య అతిథులతో పాటు పలువురు సభ్యులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో జరుగుతున్న దోపిడీ అనేక రకమైన మోసాలను గురించి చర్చించారు.
మెడికల్ మాఫియా కోరల్లో…!!!

