నారాయణ విద్యాసంస్థల తో పాటు ఆయన సమీప బంధువులలో నిర్వహించిన సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, డి.టి.సి. చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎన్ స్పైర మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ GST ఏగొట్టాడని అన్నారు. 84 వాహనాలకు GST కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు అని వారు తెలిపారు. 10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే 22 లక్షల మాత్రమే GST కట్టారన్నారు. నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి కోటి 82 లక్షలు నగదు సీజ్ చేసామన్నారు. పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఎన్ స్పైర మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారని చెప్పారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీ.ఆర్.ఐ. అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం అని అన్నారు. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేసినట్లు వెళ్లడించారు.
మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థలపై సోదాలు…
