గంజాయి వాడకం వలన యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని గంజాయి బారిన పడకుండా యువజనుల సంక్షేమం కోసం తల్లిదండ్రులు అప్రమత్తత వహించాలని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్థానిక వివేక్ భవన్ లో పౌర సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మద్యం మాదక ద్రవ్యాలు సేవించి మోటారు వాహనాలు నడపడం ఎంత నేరమో మద్యం సేవించి పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి ఓటు హక్కు వినియోగించడం కూడా అంతే నేరంగా పరిగణిం చాలన్నారు.
మద్యం సేవించి అసెంబ్లీ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల వద్దకు పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలోకి రాకుండా నిషిద్దం చేయాలన్నారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే అవకాశం లేకుండా బ్రీతింగ్ ఎనలైజర్ మెషిన్ ద్వారా కట్టడి చేయాలన్నారు. స్మార్ట్ సిటీలో మాదకద్రవ్య మహమ్మారి విముక్తి కోసం ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశంలో స్మార్ట్ సిటీ మత్స్యకార యువజన సంఘం కార్యదర్శి మోసా ఏసుబాబు, వివేకా అభ్యుదయ సేవాసమితి అధ్యక్షుడు పెంకె నూకరాజు, ఉంగరాల ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

