ప్రభుత్వ అకాడమీ, ప్రామాణికమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, పెద్ద పెద్ద ప్రశ్నలు వల్ల సమయం సరిపోక గ్రూప్ టు అభ్యర్థులు ఇటీవల ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 లో అర్హత కోల్పోతారని భయపడుతున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. కనీసం ఏ.పీ.పీ.ఎస్.సీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, వికలాంగుల రిజర్వేషన్ అమలు చేసి, నెగిటివ్ మార్కులను నాలుగు తప్పులకు ఒక మార్కుగా మార్పు చేయాలని కోరారు. జాగ్రఫీలో ఓషినోగ్రఫీ సంబంధించి ఇచ్చిన రెండు ప్రశ్నలకు రెండు గ్రేస్ మార్కులు వేసి, పోస్ట్ లు సంఖ్యను పెంచి 1:100గా మెయిన్స్ కు వెళ్లే అభ్యర్థులకు కటాఫ్ నిర్ణయించాలని తెలిపారు. ప్రభుత్వం వారు ఆందోళన చెందుతున్న నిరుద్యోగులకు ఎన్నికల కోడ్ లోపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, వయోపరిమితి 47కు పెంచి న్యాయం చేయాలని ఈ సందర్బంగా కోరారు.
లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలి…

