Trending News

రూ.25 కోట్లతో సామర్లకోట రైల్వేస్టేషన్ అభివృద్ధి…

f88ee5901f3cf151f74c6c66256a19da

అను నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల అవసరార్థం సామర్లకోట రైల్వే స్టేషన్ ను రూ. 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో పూర్తిస్థాయిలో ఆధునీకరించుటకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రైల్వే స్టేషన్ ముందుభాగం ఆధునీకరణ, ప్లాట్ఫారాలు మార్చేందుకు, అదనపుకాలిబాట, వంతెన రెండు ఎస్క లేటర్లు, ప్రయాణికులు ఉపయోగించే ప్లాట్ఫారాలకు పూర్తిస్థాయిలో రేకుల షెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందన్నారు. అదనపు మరుగుదొడ్లు, దివ్యాంగులకు వెయిటింగ్ హాలు స్టేషన్ ఆవరణ ప్లాట్ఫారాలపై ఆధునిక సాంకేతిక దీపాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ అభివృద్ధి పనులను పి.ఎం. నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్