సాఫ్ట్ వేర్ రంగంలో ఫ్రెషర్లకు ఉద్యోగాలను కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి. కాకినాడలో ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ప్రోక్సెలెరా సంస్థ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగిన ఇంటర్వ్యూలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… బీ.టెక్, ఎం.ఎస్., ఎ.ఈ., ఎం.టెక్ 2023, 2024 పాసవుట్ల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు జరిపామన్నారు. వీ.ఎల్.ఎస్.ఐ. డిజైన్స్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రోక్సెలెరా సంస్థ లిఖిత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించిందన్నారు.
అందులో ఎంపికైన విద్యార్థులకు కంపెనీ ప్రతినిధులు, ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా వెంటనే నియామక పత్రాలను కూడా అందజేయడం జరిగిందన్నారు. మిగిలిన ఫ్రెషర్లకు ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థుల నుంచి లభించిన అనూహ్య స్పందన తమకు మరింత ప్రోత్సాహం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు ప్రొక్సెలెరా సంస్థ సీ.ఈ.ఓ. మోహన్ రాఘవేంద్ర, వైస్ ప్రెసిడెంట్ కె. గురుప్రసాద్, డైరెక్టర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

