తాడేపల్లిగూడెం వద్ద జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడిగా నిర్వహించబోయే బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మరో 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి రూ. 25 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి రెండు హెలీకాప్టర్లు తీసుకోవడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదన్న చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉల్లంఘించిందని దుయ్యబడ్డారు. ఎన్నికల సమయంలో భద్రతా కారణాలతో ప్రభుత్వ హెలీకాప్టర్లు వాడే అవకాశం కేవలం ప్రధాన మంత్రికి మాత్రమే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ రకం భద్రతా కారణాలతో ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, ఎందుకు ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

