కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీ.డీ.పీ. నేతలతో టీ.డీ.పీ. పరిశీలకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయ్యాలని వారికి సూచించారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీనియర్లకు టికెట్లు ఉండవని అపోహ పడొద్దని టికెట్లు రానివారికి సముచిత స్థానం కల్పించేలా చంద్రబాబు న్యాయం చేస్తారని తెలిపారు. ఎవరికి వారు సీట్లు తమవే అని ప్రకటించుకున్న చెల్లె పరిస్థితి ఉండదని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన సీట్లే ఫైనల్ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో నియంతగా వ్యవహరిస్తున్న జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
టీ.డీ.పీ. నేతలతో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు భేటీ…

