పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనికీ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ… జనసేన పార్టీ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్నారని అదేవిదంగా సార్వత్రిక ఎన్నికల్లో బలంగా పని చేయాలని సూచించారు.
జనసేనలోకి ఇద్దరు కీలక నేతలు చేరిక…!!

