Viral

మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి……

Fishing

ఓ.ఎన్.జి.సి. సంస్థ కాకినాడ సముద్రంలో చమురు వెళికితీత కార్యకలాపాల మూలంగా ఆ ప్రదేశానికి మూసివేసింది. దానితో వేట బోట్లు అటువైపుకు వెళ్లడానికి లేకపోవడంతో వేట లేక ఆకలి పస్తులతో ఏటిమొగ మత్స్యకారులు అలమటిస్తున్నారని ఏటిమొగ ఓ.ఎన్.జి.సి. బాధ్యత సంఘం అధ్యక్షుడు సంగాడి ఈశ్వరరావు తెలిపారు. వేటకు అనుమతించకపోవడం కారణంగా నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలకు ఓ.ఎన్.జి.సి. సంస్థ ద్వారా అందిస్తున్న నష్టపరిహారం అందజేసే విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏటిమొగ మత్స్యకారులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఓ.ఎన్.జి.సి. ద్వారా జరుగుతున్న కార్యకలాపాల మూలంగా నష్టపోతున్న మత్స్యకారులకు కాకినాడ ఏటి మొగ ప్రాంతం మినహాయించి అన్నిచోట్ల నష్టపరిహారాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు. నష్టపరిహారం అందిస్తానని హామీ ఇచ్చిన ద్వారంపూడి గత తొమ్మిది నెలలుగా నోరుమెదపలేదని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ కారణంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ద్వారంపూడి కి వారు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. వారికి తక్షణనమే నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్తామని హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.