పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని వున్న పరిసరాల్లో ఒక ఆవర్తనం ఏర్పడిందని అంబటి శివప్రసాద్ తెలిపారు. దీని వలన తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం వెంబడి తేమ భారత భూభాగంలో కి చేరుతుందని అన్నారు. దీని వలన 24, 25, 26 తేదీలలో తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం లోని జిల్లాల్లో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కానీ జల్లులు కానీ పడే అవకాశం వుందని వెళ్లడించారు. కాబట్టి రైతులు కళ్ళాలలో ఏమైనా వరి ఉత్పత్తులు వుంటే జాగ్రత్తలు తీసుకోబాలని సూచించారు.
ఆ జిల్లాల్లో రైతులకు అలర్ట్…!!!
