ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా… తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న శుభ తరుణాన ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలని జనసేన అథినాయకుడు పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మల త్యాగాలను గుర్తు చేసుకొంటూ… ఆ దేవతల చల్లని చూపులు తమపై ఉండాలని అశేష భక్త జనవాహిని జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, గిరిజన సంప్రదాయాలు, పూజా విధానాలకు వేదిక ఈ జాతర అని అన్నారు. వారి గాథ స్ఫూర్తిని నింపుతూ… స్త్రీమూర్తులు శక్తి స్వరూపిణులు అని చాటిచెబుతుంది అన్నారు. నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ వేడుక విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వన దేవతలకు మొక్కులు చెల్లించడానికి అశేషంగా తరలి వస్తున్న గిరి పుత్రులకు, భక్త జనవాహినికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలి… -పవన్ కళ్యాన్-

