Viral

వై.ఎస్. షర్మిల సంచలన వ్యాక్యలు…!!!

YS-Sharmila-to-recommence-padayatra

రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వై.సీ.పీ. మూకలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, అదేవిదంగా కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం మీద చేసిన దాడులు అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఏ.పీ.సీ.సీ. చీఫ్ షర్మిలా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులని ఈ ఘటనలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛను వై.సీ.పీ. హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమన్నారు. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆమె అన్నారు. జర్నలిస్టులపై, పత్రికల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వై.సీ.పీ. పాలనలో నిత్యకృత్యాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ శ్రీ కృష్ణకు క్షమాపణ చెప్పి, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమెండ్ చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.