అధికార వైకాపా పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మదంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్ళ ఏడు నెలలు గడుస్తున్నా సమయంలో రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెట్టడం, ఆరోగ్యకరమైన రాజకీయాన్ని అరాచకం వైపు మళ్ళించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం అయిపోయిందని ఆయన తెలిపారు. నగరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు ప్రజల మాన మర్యాదలను గౌరవించేవారినే గెలిపిస్తారని ఆయన తెలిపారు.
వారికి అధికారమధం ఎక్కువైంది…!!!

