ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యునైటెడ్ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీ.ఐ.టీ.యు. ఆధ్వర్యంలో వైద్యారోగ్య ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు డి.ఏ. రత్న రాజు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సమిష్టిగా కలిసి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తుంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోగా జీతబడ్త్యాలలో చాలా వ్యత్యేసం ఉందని శ్రమకు తగ్గ జీతాలు లేవని అన్నారు.
నీరజ మాట్లాడుతూ… అధికారుల వేధిపులు అధికమయ్యాయఅని ఆవేదన వ్యక్తం చేసారు. సి.ఐ.టి.యు. ఉద్యమ సంఘం కాంట్రాక్టు అవుట్ సౌర్చింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అహర్నిశలు పోరాటాలు చేసి రెగ్యులర్ చేయిస్తే కొంతమంది ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆలాంటి వారి పట్ల ఉద్యోగులు అప్రమత్తం గా వుండాలని తెలిపారు. ఉద్యోగులు వాస్తవాలు గ్రహించి సి.ఐ.టి.యు. వంటి ఉద్యమ సంఘాలతో ఐక్యంగా కదిలీతే మన హక్కులు సాధించుకోగలమని ఆమె అన్నారు.

