ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పీ. హరిప్రసాద్ పేర్కొన్నారు. 25 ఏళ్ల రాజకీయాలను ఊహించుకుంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలన్నారు.
ఆయనకు పదవులు, డబ్బుపై ఆశ లేదని, ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలన్న ఆకాంక్ష తప్ప, కష్టపడి సంపాదించిన సొమ్మును సైతం ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తరువాత కూడా పట్టువదలకుండా ప్రజల సమస్యలపై యుద్ధం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, రాజధాని రైతుల సమస్యలపై పోరాడారని తెలిపారు.
రాజకీయ నాయకుడు అనే వాడు ఎలక్షన్ కోసం పోరాడతాడు… పవన్ కళ్యాణ్ వంటి గొప్ప నాయకుడు ముందు తరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడానికి బలమైన కారణం ఉందని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు వస్తుందని గుర్తు చేసారు.

