కోటి రూపాయలు విలువైన నాలుగు క్వింటాళ్ళ గంజాయిని ఒక ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ… భద్రాచలం టౌన్ లో వాహనాల తనికీలలో భాగంగా ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను తనిఖీ చేసామన్నారు.
ఆ బస్సులో నాలుగు క్వింటాళ్ల గంజాయిని గుర్తించారని ఈ క్రమంలో పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని విచారణ చేశామని తెలిపారు. పట్టుబడిన నిందితుడితోపాటు బస్సులో ఏడుగురు అతని సమీప బంధువులు ఉన్నారని సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని కరిమెల ఒరిస్సా రాష్ట్రం నుండి సుమారు నాలుగు క్వింటాళ్ల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకోస్తున్నామని తెలిపారని వెళ్లడించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ.ఎస్. పరితోచ్ పంకజ్, సీ.ఐ. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రైవేట్ బస్ లో గంజాయి కలకలం…!!!

