కొలకత్తా ఆర్మీ బేస్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ బత్తుల వెంకటరాజు (40) డ్యూటీ చేస్తూ హటాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం రాత్రి మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని అతని స్వగ్రామయిన రాచర్ల మండలం సోమిదేవిపల్లెకి ఆదివారం రాచమర్యాదతలో తీసుకొచ్చారు. గిద్దలూరు నియోజకవర్గం వై.ఎస్.ఆర్.సీ.పీ. ఇన్చార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, తదితరులు కలిసి వచ్చి అమర జవాన్ భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జవాన్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని మనోధైర్యం ఇచ్చారు.
కొలకత్తా ఆర్మీ బేస్ లో విషాదం…
