విశాఖ పటణంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్తానిక ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్ దగ్ధమైంది. దానితో భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమించారు. ఈ ఘటణ పై విశాఖ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం…
