Political

దొంగ ఓట్లుపై ఆధారపడుతున్న ద్వారంపూడి… -కొండబాబు-

WhatsApp Image 2024-02-16 at 4.20.12 PM

వై.సీ.పీ. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు కొండబాబు ఆరోపించారు. కాకినాడ సిటీ నియోజవర్గం సంబంధించి ఓటర్ ముసాయిద జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై వనమాడి కొండబాబు శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆధారాలతో కూడుకున్న వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం సాగిస్తున్న అరాచక విధ్వంసక పాలనపై ప్రజలలో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతో రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందన్నారు. దానిలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీగా దొంగ ఓట్లు చేర్పించి, టి.డి.పి. సానుభూతిపరులు ఓట్లను తొలగించడం జరిగిందనని అన్నారు.

దొంగ ఓట్లు చేర్పులు, టి.డి.పి. సానుభూతుపరుల ఓట్లు తొలగింపుపై గత ఆరు నెలలుగా పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఓటర్ జాబితాపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. టీ.పీ.ఆర్.ఓ. లపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకొని ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని కొండబాబు కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గుమ్మల్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.