తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ యాగ నిర్వహణలో 50 మంది రిత్వికులు పాల్గొన్నారు. రాజ శ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం పూర్ణాహుతి తో యాగం ముగియనుందని తెలిపారు.
రాజ శ్యామల యాగం చేపట్టిన టీడీపీ అధినేత…

