Education / Career

విద్యార్థినీ, విద్యార్థులు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకోవాలి…

WhatsApp Image 2024-02-16 at 2.42.20 PM

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇన్స్పైర్ మనాక్ 11వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు మరియు ప్రాజెక్టు పోటలు-2024 ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎం. కమల కుమారి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థినీ, విద్యార్థులు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారీలోని సృజనాత్మక జోడించి నూతన ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా రాణించాలని అన్నారు.

జిల్లా పేరు ప్రఖ్యాతలను రాష్ట్ర, కేంద్ర స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్ విద్యా, వైజానిక ప్రదర్శనకు కోనసీమ జిల్లా నుంచి ఏడు ప్రాజెక్టులు ఎంపికైనట్లు వెల్లడించారు. ఏడు ప్రాజెక్టులలో స్థానిక మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూలు విద్యార్షి నక్కా సత్య ప్రవీణ్ రూపొందించిన ప్లాంట్ గోయింగ్ మెషీన్, 97 మార్కులతో ముందంజులో నిలిచిందన్నారు.

మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని ప్రతిభ అనేది ఎవరి సాత్తుకాదని, రాతి యుగంలో రాళ్ళ మధ్య రాపిడితో అగ్గి పుట్టించే నాటి నుండి చంద్ర మండలం పై మన భారత శాస్త్ర వేత్తలు రోవర్ ని ల్యాండ్ చేసే స్థాయికి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యా యులు పి.ఈ.టి. లు విద్యార్థులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన