వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో తొమ్మిదవ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ వాద్రేవు లోవరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరెంటు ధరలు పెంచడంతో ఒక్కో కుటుంబం సుమారు 15 వేల రూపాయల నష్టపోతుందన్నారు.
ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వహించడం, పరిశ్రమల ఏర్పాటు లో జాప్యం చేస్తున్నారన్నారు. కాకినాడ నగర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని పాలన అందిస్తున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఇంటికి పంపించేందుకు సిద్ధమే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి మరియా, వాడమొదల రత్నం, బండి సుజాత, మిరియాల హైమావతి,బొట్టు లీల,మోర్తా మాలతి, తదితరులు పాల్గొన్నారు.

