Exclusive

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…

WhatsApp Image 2024-02-15 at 6.08.29 PM

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏల్లవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ.పీ. ఎన్జీవో అధ్యక్షులు జి. రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఆయన అన్నారు.

తమ న్యాయపరమైన డిమాండల పరిష్కారం కోసం ఏ.పీ. ఎన్జీవో, జే.ఏ.సీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా రెండవ రోజు భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు, ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ 30 శాతం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న జి.ఈ.ఎఫ్., ఏ.పీ. జి.ఎల్.ఐ., సరెండర్ లీవ్ ఎంక్యాష్మెంట్ తక్షణం క్లియర్ చేయాలని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.