కాకినాడలోని టీ.డీ.పీ.-జనసేన ఉమ్మడి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానకి సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగితో పాటు ఇతరుల సభ్యులతో కలిసి సానా సతీష్ బాబు పాల్గొని క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘం సభ్యులకు తనవంతు సహాయసహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోస ఇచ్చారు.
వారందరూ తనకు ఎంతగానో మద్ధతును తెలుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. సానా సతీష్ బాబు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కొప్పుల వెలమ సంఘం సభ్యులు యాసలపు కన్నబాబు, పోతుల రవి, పి. నాగమహేశ్వరి, గోగాడ వి.ఎల్.ఎన్. నాయుడు, బి.ఆర్. నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
