కాకినాడ నగరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సాంబమూర్తి నగర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకతేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం అత్యం కన్నుల వైకుంఠంగా ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన రుత్విక్ ల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాకినాడ కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నారాయణరావు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ ఫెసిలిటీ వెంకటలక్ష్మి శేఖర్, మాజీ మేయర్ సుంకర శివప్రసాన్నాసాగర్. పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం అత్యంత కోలాహాలంగా సాగింది.

