అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో గోడి గురుకుల పాఠశాలలో రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థిని, విద్యార్థులకు సర్వతమ్మ ముత్యాలు చారిటబుల్ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ సెక్రటరీ తాళ్ళ సత్యనారాయణ మూర్తి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలకు అవసరం అయిన పాడ్స్ మరియు పెన్ లను 125 మంది పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించేసారు. ఈ సందర్బంగా ఇరువురు ప్రిన్సిపాల్స్ టీ.ఎస్.ఎన్. మూర్తి సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జల్లి శ్రీనివాసరావు, నాతి శ్రీనివాసరావు, తాళ్ళ సాంబమూర్తి, బొంతు శ్రీను, గోసంగి సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
గోడి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ…

