కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని వాకలపుడి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రజలకు బీ.పీ., షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలను ఫౌండేషన్ వైద్యులు ఉచితం చేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు అందుకే మన జిల్లా ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సానా సతీష్ బాబు సారథ్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న అనూహ్య స్పందన తమకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని, వారికి వైద్య శిబిరాలు ఉపయోగ పడటం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

