రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి ప్రజల్లోకి మరింత చేరువవుతూ వారి ఆధరన మరియు అభిమానాలు పొందతుంది. ఇందుకు నిదర్శంగా ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రమానికి చెందిన కొందరు యువకులు వై.సీ.పీ. నుంచి టీ.డీ.పీ. లోకి చేరారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వై.ఆర్.కే. పరమహంస ఆధ్వర్యంలో మండపేట పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస పాలన పోవాలంటే వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ. పార్టీ ని అధికారంలోకి తీసుకురావలని అన్నారు. అందుకు మనమందరం కలిసిగట్టుగా పనిచేయాలని సుచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వై.ఆర్.కే. పరమహంస, పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

