అన్నవరపు లంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోన శేషకుమారి కుటుంబాన్ని జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్బంగా గ్రామ జనసేన శ్రేణులు సమీకరించిన రూ.1.2 లక్షల ఆర్థిక సాయాన్ని ఆమె కుటుంబానికి అందచేశారు. మృతురాలికి ఇద్దరు చిన్నారులు ఉన్నారన్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఆయన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కనిగిరి లంకకు చెందిన మేకా ప్రవీణ్ అనే జనసేన క్రియాశీలక సభ్యుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా పామర్రు నియోజకవర్గ ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ రూ.10 వేలు, గ్రామ ప్రజలు రూ. 2 వేలు మనోహర్ చేతుల మీదుగా ఆర్ధిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

