Political

జనసేన-టీడీపీ తోనే యువతకు ఉపాధి…

WhatsApp Image 2024-02-12 at 8.09.04 AM (1)

ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు సైతం వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక వెనక్కి మళ్లాయనీ, కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా ఏమీ లేవన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తూములూరు సుగాలి కాలనీలో పలువురు యువకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం హనుమన్ పాలెం, అన్నవరపులంక గ్రామాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వంలో ఇసుక దోపిడి, ఉన్న రోడ్లు నాశనం చేయడం మినహా జరిగిన అభివృద్ధి లేదు. ఎన్నికల ముందు వచ్చి ముద్దులుపెట్టి ఇప్పుడు జనాన్ని గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.