అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన ఐదుగురులో ఈ ముగ్గురు వాగు నుంచి బయటకు రాలేకపోయారు. గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కాకర వీరవెంకట అర్జున్, అండిబోయిన దేవి చరణ్, లావేటి రామన్ మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యార్థుల కోసం గాలించి చివరికి దేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎదిగొచ్చిన కుమారులను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.
