అన్నమయ జిల్లా రాజంపేట పట్ణంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ నుంచి దిగుతూండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఐ.టి.బి.పి. హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా కలికిరి క్యాంప్ బేస్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకొని మృతుడిని ఆసుపత్రికి తరలించారు. నందలూరు రైల్వే స్టేషన్ లో ట్రెయిన్ ఒక క్షణం ఆగి బయలు దేరిన సమయంలో దిగుతుండగా చక్రాల కింద పడి
అతను మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
నందలూరు రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం…
