కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో బ్రౌన్ పేట సెంటర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్ దగ్గర ఒక బైకును ఆదే దారిలో వెళ్తున్న ఒక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. దానితో ఒక యువకుడు గాయాలకు గురయ్యారు. బైక్ పై వెళ్తుండగా యువకుడిని స్థానిక బ్రౌన్ పేట దుర్గాదేవి ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి భాదితుడిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి న్యాయం చేయాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సామర్లకోటలో బైక్ ను ఢీకొన్న టిప్పర్…!!!
