Aral Sea (ఆరల్ సముద్రం) మాయం…!!!

అవును మీరు చూస్తున్నదీ… చదువుతున్నదీ నిజమే. ప్రపంచం విస్తుపోయో ఈ నిజం తెలిస్తే ఒక్క క్షణం గుండె లయ తప్పుతుంది. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా… పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల పర్యవసానంగా 68,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన Aral Sea (ఆరల్ సముద్రం) మాయమైపోయింది.

ఆ ప్రాంతమంతా లోతైన ప్రాంతంగా దర్శనమిస్తోంది. కజికిస్థాన్ – ఉజ్బెకిస్థాన్ దేశాల సరిహద్దులలో ఉన్న ఈ సముద్రం నిర్జీవంగా మారింది. మానవ నివాసయోగ్యంకాని ఆ ప్రాంతం ఇప్పుడు నాసా చిత్రపటాల్లో ఎక్కింది. ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించడంతో పాటు ఆలోచనల్లో పడేసింది.
