భారత దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గోకుల్ పూరి మెట్రో స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చేసుకుంది. అక్కడ మెట్రో బ్రిడ్జి స్లేబ్ హటాత్తుగా కూలి క్రింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భాదితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఢిల్లీ లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం…
