Political

జనసేన-టీ.డీ.పీ తోనే పాయకరావుపేట అభివృద్ధి…!!! -నాగబాబు-

naga4-1549977417

సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థలమయిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం కార్యకర్తలతో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న దాకలాలు లేవన్నారు.

లక్షలాది మంది మత్స్యకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి  వలసపోతున్నారన్నారు. మత్స్యకారులనుంచి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ (ఎన్.ఏ.ఓ.బీ.) నిర్మాణానికి భూమిని సేకరించిందన్నారు. వారికి తగిన నష్టపరిహారంతోపాటు వేరొక ప్రాంతంలో భూమి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిందన్నారు.

కనీసం ఆ ప్రాంతంలో వేటకు వెళ్లడానికి కూడా లేకుండా ఆంక్షలు విధించిందన్నారు. స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమై పశువులు మృత్యువాత పడటంతో యాదవులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు వెంకట సతీష్, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.