బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మొత్తం 20 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి బీమా మొత్తాన్ని అందించారు.
ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… 6.3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీకి ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ మొత్తం 226 మంది మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.10.3 కోట్ల బీమా సాయం అందించామన్నారు. 320 మందికి మెడికల్ రీ ఎంబర్స్మెంట్ సొమ్ము రూ. 2 కోట్ల వరకు అందించాం.
పార్టీ కోసం ఎంతో కష్టపడి అనుకోని ప్రమాదంలో మృతి చెందుతున్న క్రియాశీలక సభ్యుల కుటుంబాలను ప్రత్యక్షంగా వెళ్లి పరామర్శించి వారికి ఆపద కాలంలో అండగా నిలవడం వారికి కొండంత భరోసా నింపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, క్రియా వాలంటీర్లు పాల్గొన్నారు.

