పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్, ఎస్పీతో మాట్లాడుతూ… పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు మాదేపల్లి పై కత్తితో దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారని చెప్పారు.
వారి వెనుక ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి పనులు ఇంతకు ముందు వినలేదని, చూడలేదని, ఇటువంటి ప్రయత్నాలు చేయడం పట్ల పిఠాపురం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు.

