విశాఖపట్నం జిల్లాలో ఒక ఆర్.టీ.సీ. బస్ లో దొంగ బంగార బిస్కెట్లు ప్రయానికులను భాయాందోళనకు గురిచేసింది. దొంగ బంగారాన్ని రవాణ చేస్తున్నారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసు అధికారులు విశాఖలో వాహనాల తనిఖీ ప్రారంభించారు. ఆ తనిఖీలలో ఒక బస్ లో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బంగారు బిస్కెట్లను తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్త 7 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఆర్.టీ.సీ. బస్ లో దొంగ బంగారం కలకలం…

