04.02.2024 ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్. రోడ్డు లోని డీ.ఎస్.ఏ. (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) గ్రౌండ్ నందు ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి పోటీలలో యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. తదనందం పోటీల్లో పాల్గొని నెగ్గిన విజేతలకు బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో కన్నబాబు, పోటీధారులు, తదితరులు పాల్గొన్నారు.

